కాగజ్‌నగర్ పట్టణం రైల్వే స్టేషన్ ఎదుట గల అన్నపూర్ణ హోటల్ యజమాని జగదీష్ గౌడ్ రెండురోజుల క్రితం మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ దండే విఠల్ శుక్రవారం వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇచ్చారు. వారి వెంట మాజీ జెడ్పీ చైర్మన్ సీడం గణపతి కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.