కాగజ్నగర్‌లో పారిశుధ్య పనులపై మున్సిపల్ కమిషనర్ జి. తిరుపతి

4చూసినవారు
కాగజ్నగర్‌లో పారిశుధ్య పనులపై మున్సిపల్ కమిషనర్ జి. తిరుపతి
కాగజ్నగర్ పట్టణంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ జి. తిరుపతి పారిశుధ్య పనులను స్వయంగా పరిశీలించారు. వార్డుల్లో చెత్త సేకరణ, కాలువల శుభ్రత, రహదారుల పరిశుభ్రత పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, సిబ్బందికి సూచనలు చేశారు. పట్టణ ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా పనులు నిరంతరం కొనసాగాలని, అలసత్వం ప్రదర్శించవద్దని ఆదేశించారు. చెత్తను సమయానికి తరలించడం, డ్రెయిన్లలో నీరు నిల్వ లేకుండా చూడటం, దోమల నివారణ చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం డంపింగ్ యర్డును కూడా పర్యవేక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్