కాగాజ్‌నగర్ మండలంలోని ఈస్గాం పోలీస్ స్టేషన్‌కు నూతన సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా నరేష్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు చింతలమనేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేసిన ఆయన, ఈస్గాం పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, శాంతి భద్రతలను కాపాడతానని, మండలంలో చట్టవ్యవస్థను బలోపేతం చేస్తానని నరేష్ తెలిపారు.