కాగజ్‌నగర్‌లోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడిగా కోనేరు కృష్ణరావు, అధ్యక్షుడిగా పోతురాజుల రమేష్, ప్రధాన కార్యదర్శిగా ఎనగంటి బిక్షపతి, కోశాధికారిగా పిరిసింగుల శంకరయ్య బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షులుగా కాట్రగడ్డ ప్రసాద్, కలవేని రమేష్; సంయుక్త కార్యదర్శులుగా మోర్లే సత్యనారాయణ, వేముల వెంకటేష్; ప్రచార కార్యదర్శులుగా నీలి సతీష్, రాచకొండ రవీందర్, బర్ల కిరణ్ కుమార్ నియమితులయ్యారు. సాంస్కృతిక విభాగంలో జయన్ నాయర్ తదితరులు బాధ్యతలు చేపట్టారు.