బీబ్రా గ్రామంలో పేకాట దందా బహిర్గతం – ఐదుగురు పట్టుబాటు

3చూసినవారు
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు దహేగాం మండలం బీబ్రా గ్రామం వద్ద పేకాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 5, 960/- నగదు, 52 పేకాట కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను దహేగాం పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్ మాట్లాడుతూ, “పేకాట, జూదం, గంజాయి వంటి అక్రమాలపై కఠిన చర్యలు కొనసాగుతాయి” అని తెలిపారు. ఈ దాడిలో టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ బృందం పాల్గొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్