కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్ వద్ద గుంతలమయమైన రహదారి

1చూసినవారు
కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి పూర్తిగా గుంతలతో నిండిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే ఈ రహదారి శిథిలావస్థకు చేరడంతో ఆటో, ద్విచక్ర, కార్ల డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో గుంతల్లో నీరు నిలిచి ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయని, రాత్రి వేళల్లో గుంతలు కనిపించక వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్