కాగజ్‌నగర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో శనివారం ఉదయం 10 గంటలకు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పాలనా విజయాలపై మీడియా సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వివిధ రంగాల్లో సాధించిన విజయాలను ఎమ్మెల్యే హరీష్ బాబు వివరించనున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు,
బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరుకావాలని ఆహ్వానించారు.