కాగజ్‌నగర్: వర్షాకాలంలో వైరల్ వ్యాధుల నివారణకు సూచనలు: ఎంపీడీఓ

51చూసినవారు
కాగజ్‌నగర్: వర్షాకాలంలో వైరల్ వ్యాధుల నివారణకు సూచనలు: ఎంపీడీఓ
కాగజ్నగర్ మండలంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గ్రామస్థాయిలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కాగజ్‌నగర్ ఎంపీడీవో కోట ప్రసాద్ సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. వర్షాల కారణంగా వైరల్ వ్యాధుల ప్రభావం పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆరోగ్య సిబ్బందితో పాటు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.