కాగజ్‌నగర్ మండలంలో టీఎస్‌యుటిఎఫ్ ఆధ్వర్యంలో శనివారం సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షురాలు వైద్య శాంతికుమారి మాట్లాడుతూ గురుకుల ఉపాధ్యాయులకు పారిటీ స్కేల్స్, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, బోధనేతర పనుల నుంచి మినహాయింపు ఇవ్వాలని, ప్రత్యేక వార్డెన్లు, కేర్ టేకర్లు నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత, పెండింగ్ డీఏలు, బిల్లులు విడుదల చేయాలని కోరారు.