15వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు

1చూసినవారు
15వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు
కాగజ్‌నగర్‌లో ఎస్పీఎం మిల్లు కార్మిక సంఘ ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. జేఏసీ నాయకుడు గోలెం వెంకటేశం మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు. లేబర్ శాఖ అధికారుల సమక్షంలో యాజమాన్యంతో చర్చలు జరిపి, కోర్టులో ఉన్న పిటిషన్ ఉపసంహరణకు చర్యలు తీసుకుని ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గోగర్ల రాములు, వల్లాల సుభాష్, సి. వెంకటేష్, రాజేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్