కాగజ్‌నగర్ మండలం కోసినీ గ్రామ పంచాయతీ పరిధిలోని పర్ధన్‌గూడా ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల భవనం పైకప్పు లీకేజీతో
విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)కు వినతిపత్రం అందజేశారు. భవనానికి వెంటనే అంచనా సిద్ధం చేసి మరమ్మతులు చేపట్టాలని, అప్పటి వరకు విద్యార్థుల భద్రత కోసం ప్రత్యామ్నాయ భవనం ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థుల విద్యకు అంతరాయం కలగకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.