కాగజ్‌నగర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ తూడూరు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పి. రవీందర్ గౌడ్ సమక్షంలో విద్యార్థులు, సిబ్బంది రోడ్డు భద్రతా ప్రమాణం చేశారు. ట్రాఫిక్ నియమాలు, రవాణా చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ కె. శ్రీదేవి జాగ్రత్తల గురించి వివరించగా, అధికారులు సందేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.