కాగజ్‌నగర్ పట్టణంలో తాగునీటి సరఫరాను మెరుగుపరచడానికి యూఐడీఎఫ్ కింద రూ. 31.70 కోట్లు మంజూరయ్యాయని సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. మున్సిపల్ అత్యవసర సమావేశంలో మాట్లాడుతూ, ఈ నిధులతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద అండర్‌గ్రౌండ్, స్టార్మ్ వాటర్ డ్రైనేజీ కోసం కూడా నిధులు సమీకరిస్తామని చెప్పారు. రోడ్లపై చెత్త వేస్తే జరిమానాలు విధించాలని అధికారులకు సూచించారు. పదవీ విరమణ పొందిన 8 మంది శానిటేషన్ సిబ్బందిని సన్మానించారు.