దరిగాం గ్రామాన్ని దోచుకున్న గత పాలకులపై ఆర్ఎస్పీ విమర్శలు

0చూసినవారు
కాగజ్‌నగర్‌ మండలం దరిగాం గ్రామాన్ని గత పాలకులు దోచుకున్నారని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌. ఎస్‌. ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గ్రామాన్ని సందర్శించి మాట్లాడుతూ, వందేళ్ల గ్రామానికి ఇప్పటికీ రోడ్డు, మౌలిక సదుపాయాలు లేవని, సర్పంచ్‌ పేరుతో నిధులు లూటీ చేశారని ఆరోపించారు. అత్యవసర పరిస్థితుల్లో రోడ్డు లేక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో చదువుకున్న అభ్యర్థి కన్నయ్యను గెలిపిస్తే రోడ్డు, నెట్‌వర్క్, విద్యా సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్