విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌ఎస్పీ

1చూసినవారు
గొండాయిపేట్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మాజీ అధికారి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ గురువారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. చదువుపై శ్రద్ధ పెట్టి, కష్టపడితే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు దూరంగా ఉండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. లక్ష్య సాధనలో అడ్డంకులు రాకుండా క్రమశిక్షణతో చదవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాగపురే బండు పటేల్, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్