సిర్పూర్ పేపర్ మిల్స్‌లో భద్రతా మాసోత్సవాల ముగింపు ఘనంగా

0చూసినవారు
సిర్పూర్ పేపర్ మిల్స్‌లో భద్రతా మాసోత్సవాల ముగింపు ఘనంగా
కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్స్‌లో జాతీయ భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సిహెచ్. లక్ష్మీ కుమారి ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పరిశ్రమల్లో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె సూచించారు. వర్క్స్ వైస్ ప్రెసిడెంట్ ఏ. కే. మిశ్రా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భద్రతా నియమాల ప్రాముఖ్యతను వివరించారు. జీఎం ఎంఎస్ గిరి, సేఫ్టీ మేనేజర్ శ్రీనివాస్ కూడా మాట్లాడారు. భద్రతా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్