కాగజ్‌నగర్‌లోని రేణుక ఎల్లమ్మా మాత గుడిలో ఫిబ్రవరి 19న జరిగిన దొంగతనం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మార్చి 2న రెండో నిందితుడు మానుపాటి నరేష్‌ను కాజీపేట సమీపంలోని మణికొండ గ్రామంలో అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి నకిలీ బంగారు బొట్టు బిల్లా, సుమారు 10 గ్రాముల బంగారు కమ్మలు, 1250 గ్రాముల రెండు వెండి కిరీటాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించి, కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.