కాగజ్‌నగర్ ఆర్ఆర్ఓ కాలనీలో షీ టీం అవగాహన కార్యక్రమం

5చూసినవారు
కాగజ్‌నగర్ ఆర్ఆర్ఓ కాలనీలో షీ టీం అవగాహన కార్యక్రమం
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ టౌన్ ఆర్ఆర్ఓ కాలనీ కేజీబీవీ పాఠశాలలో షీ టీం ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది. షీ టీం ఇంచార్జ్ ఏఎస్ఐ సునీత మాట్లాడుతూ, మహిళలు వేధింపులు, సైబర్ మోసాలు వంటి సమస్యలు ఎదుర్కొంటే డయల్ 100 లేదా 87126 70565 నంబర్‌కి సంప్రదించాలని సూచించారు. మహిళా భద్రతకు పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సునీతతో పాటు డబ్ల్యూపీసీ రమ, పిసి శ్రీనివాస్, ఎస్‌ఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్