కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ప్రజా పాలన–ప్రగతి పాలన కార్యక్రమంలో భాగంగా, కాగజ్‌నగర్ షీ టీమ్ ఆధ్వర్యంలో వసుంధర డిగ్రీ కాలేజ్, బస్టాండ్, ఆటో స్టాండ్ ప్రాంతాల్లో విద్యార్థులు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. షీ టీమ్ ఇన్‌చార్జ్ ఏఎస్‌ఐ డి. సునీత మహిళా భద్రత, బాలికల భద్రత, లింగ సమానత్వం, సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో 112 సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.