కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా, కాగజ్‌నగర్ షీ టీం సిర్పూర్ టీ మండలం వేంపల్లి, నౌగాంబస్తి అంగన్వాడీ కేంద్రాలు, వివేకానంద డిగ్రీ కాలేజ్ పరిసరాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నపిల్లల భద్రత, లింగ సమానత్వం, సైబర్ నేరాలు, బాల్య వివాహాల నివారణపై వివరించారు. బి. ఎన్. ఎస్ చట్టంపై కూడా అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112, 1930, 1098 నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు. షీ టీం సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.