సిర్పూర్ నియోజకవర్గంలోని ఆర్‌అండ్‌బీ రహదారుల అభివృద్ధికి హ్యామ్ ఫేజ్-1 ప్రాజెక్టు కింద రూ. 203.76 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్‌బాబు తెలిపారు. కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్డు నుంచి సిర్పూర్ వరకు డబుల్ రోడ్డుకు రూ. 73.22 కోట్లు, సిర్పూర్ నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు రూ. 10.50 కోట్లు, దహేగాం మండలం కల్వాడ–ఒడ్డుగూడ రహదారికి రూ. 53.52 కోట్లు, చింతలమానేపల్లి మండలం బాబాసాగర్–గూడెం రహదారికి రూ. 15.80 కోట్లు మంజూరయ్యాయి. కాగజ్‌నగర్, సిర్పూర్ పట్టణాల్లో సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయనున్నారు.