రైల్వే అభివృద్ధిపై చర్చలు జరిపిన సిర్పూర్ ఎమ్మెల్యే

73చూసినవారు
రైల్వే అభివృద్ధిపై చర్చలు జరిపిన సిర్పూర్ ఎమ్మెల్యే
సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్ బాబు శుక్రవారం నాడు ఢిల్లీలో రైల్వే బోర్డు ఛైర్మన్ సతీశ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గంలోని రైల్వే అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా, సిర్పూర్ కాగజ్ నగర్‌కు కొత్త రైళ్లను మంజూరు చేయాలని, ఇప్పటికే నడుస్తున్న కొన్ని రైళ్లను సిర్పూర్ వరకు పొడిగించాలని ఎమ్మెల్యే కోరారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రైల్వే సదుపాయాలు అందించేందుకు తన ప్రయత్నాలు కొనసాగుతాయని హరీశ్ బాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్