వ్యాపారవేత్తలకు శుభాకాంక్షలు తెలిపిన సిర్పూర ఎమ్మెల్యే

4చూసినవారు
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గురువారం కాగజ్‌నగర్ పట్టణంలోని మెయిన్ మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వ్యాపారవేత్తలు, షాప్ యాజమానులను కలుసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మార్కెట్‌లోని వ్యాపార వాతావరణం, వ్యాపారుల సమస్యలపై ఆరా తీసిన ఎమ్మెల్యే, ప్రభుత్వం తరఫున సాధ్యమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. పట్టణ అభివృద్ధిలో వ్యాపార రంగం కీలక పాత్ర పోషిస్తుందని, వ్యాపారుల కష్టసుఖాల్లో తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :