రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో, కాగజ్‌నగర్‌లోని వినయ్ గార్డెన్స్‌లో పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ నితికా పంత్ బ్రీఫింగ్ నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్, అదనపు ఎస్పీ చిత్తరంజన్, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.