సిర్పూర్: శివాలయంలో శాకాంబరీ అలంకారంతో లలితాదేవి ప్రత్యేక పూజ

80చూసినవారు
సిర్పూర్: శివాలయంలో శాకాంబరీ అలంకారంతో లలితాదేవి ప్రత్యేక పూజ
సిర్పూర్ మండల కేంద్రంలోని బాలాజీ వెంకటేశ్వర దేవాలయం పరిసరంలోని శివాలయంలోని శ్రీ లలితా దేవి సన్నిధిలో ఆదివారం అమ్మవారిని వివిధ కూరగాయలతో శాకాంబరీ దేవిగా అలంకరించి ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం లలితా సహస్రనామ పారాయణం, స్తోత్రాలు, హరతులు, నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని సేవించారు. చివరగా భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్