24వ రోజుకు చేరిన ఎస్పిఎం కార్మికుల రిలే దీక్షలు

0చూసినవారు
కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు సంఘ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 24వ రోజుకు చేరుకున్నాయి. కార్మికుల న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం, అధికారులు పట్టించుకోకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ముంజం ఆనంద్ కుమార్, సీఐటీయూ అధ్యక్షురాలు ఆర్. త్రివేణి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు బోర్కుట్ రాజేందర్ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. కార్మికులకు తమ ప్రతినిధులను ఎన్నుకునే ప్రజాస్వామ్య హక్కు ఉందని, గుర్తింపు ఎన్నికలను ఆలస్యం చేయడం సరైందికాదని ముంజం ఆనంద్ కుమార్ అన్నారు.

సంబంధిత పోస్ట్