కాగజ్‌నగర్ సిర్పూర్ పేపర్ మిల్లు గేటు ముందు కార్మిక సంఘాల సీక్రెట్ బ్యాలెట్
ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరుకున్నాయి. కార్మిక సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు గోలెం వెంకటేశం మాట్లాడుతూ, మిల్లులో కార్మికుల శ్రమ దోపిడీ జరుగుతోందని, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని యాజమాన్యంతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.