SRS యూత్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం

1చూసినవారు
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామపంచాయతీ పరిధిలోని ధరంపల్లి–బారేగుడ గ్రామాల మధ్య SRS యూత్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. వాగు ఒడ్డున పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు, ముళ్లపొదలను తొలగించారు. గత ఏడాది అకాల వర్షాల వల్ల ఏర్పడిన వరదల కారణంగా రాకపోకలకు ఇబ్బందులు, విష పురుగుల భయం నెలకొందని స్థానికులు తెలిపారు. SRS యూత్ అధ్యక్షుడు గుర్లే శ్రీనివాస్ చొరవతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో ఉపాధ్యక్షుడు బోర్లే పురుషోత్తం, గ్రామస్థులు మోర్లే సుధాకర్, చంద్రు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్