కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో సోమవారం కౌటాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యులు రోహినే అరవింద్, కుశాబ్ రావు, సేంద్రే కాళిదాస్, కర్మన్ కార్ భగవాన్, గణేష్ సత్తార్ భారతీయ జనతా పార్టీలో చేరారు. సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో భాజపా అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్ములే మధుకర్, చందన్ ఖడే తిరుపతి, బోయర్ బండు తదితరులు పాల్గొన్నారు.