కాగజ్‌నగర్ పట్టణంలో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ మీడియా సమావేశం నిర్వహించింది. సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నామని మహేష్ మాట్లాడుతూ, ఈ 12 ఏళ్లలో దేశం మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు, డిజిటల్ విప్లవం రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. భారతదేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచిందని, తెలంగాణ సమగ్ర అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని అభిప్రాయపడ్డారు.