ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత పంపిణీకి జిల్లా ఎంపిక హర్షణీయం

0చూసినవారు
రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను ఎంపిక చేయడంపై ఎమ్మెల్సీ దండే విఠల్ సంతోషం వ్యక్తం చేశారు. కాగజ్‌నగర్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైన ఉత్తర తెలంగాణ ప్రాంతాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వైఎస్సార్ హయాంలో పేదలకు ఇళ్లు అందించగా, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు డబుల్ బెడ్‌రూం ఇళ్ల పేరుతో ప్రజలను నిరాశపరిచాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే పేదల సొంతింటి కలలు నెరవేరుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్