ఉపాధి హామీ చట్టాన్ని పాత విధానంలో కొనసాగించాలి: ముంజం ఆనంద్

0చూసినవారు
కాగజ్‌నగర్ మండలం చింతగూడ కోయావాగుల గ్రామంలో ఉపాధి హామీ పనులను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్ పరిశీలించారు. కూలీల సమస్యలను తెలుసుకున్న ఆయన, కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని చూస్తున్న విబిజి రాంజీ చట్టాన్ని రద్దు చేసి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పాత విధానంలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ. 600 వేతనం చెల్లించాలని, పనిస్థలాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ నెల 16న కాగజ్‌నగర్‌లో నిర్వహించే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్