కొమురంభీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వు జీవోను విరమించుకోవాలి

75చూసినవారు
కొమురంభీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వు జీవోను (జీవో నం. 49) రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి‌అని సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు డిమాండ్ చేశారు. జీఓ ప్రతులను దహనం చేశారు. ఆదివారం కాగజ్‌నగర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో‌ ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ‌మాట్లాడారు. జీవో నం. 49 ను తీసుకువచ్చి కుమురం భీం జిల్లాలోని రైతులకు, గిరిజనులకు, గిరిజనేతరులకు తీరని అన్యాయం చేసిందని విమర్శించారు.