సిర్పూర్(టి)మండలం డోర్పల్లి గ్రామంలోని పోడు భూముల సమస్యను పరిష్కరించి గిరిజన రైతులకు న్యాయం చేయాలని
కాంగ్రెస్ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్-అండమాన్ నికోబార్ రాష్ట్రాల ఇన్‌చార్జి, ఆల్
ఇండియా మహిళా
కాంగ్రెస్ కార్యదర్శి బి. అధిత కోరారు. గిరిజన రైతుల విజ్ఞప్తి మేరకు సిర్పూర్(టి) అటవీశాఖ కార్యాలయానికి వెళ్లి ఎఫ్‌ఆర్‌ఓను కలిసి వినతిపత్రం అందజేశారు. గిరిజన రైతుల హక్కుల పరిరక్షణకు
కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అధిత తెలిపారు. రైతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కోరారు.