సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఘన నివాళులు

1చూసినవారు
కాగజ్‌నగర్ మండలం కోస్ని గ్రామంలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, మహిళా విద్యకు మార్గదర్శకురాలైన సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయమని, ఆమె ఆశయాల ప్రకారం బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ ఎల్. శ్యామ్ రావు, గ్రామ సర్పంచ్ వసాకే పులబాయ్, ఉపసర్పంచ్ సాజిత్, గ్రామ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్