ఉద్యమకారులకు హామీలు అమలు చేయాలి: టీయూవి వినతి

0చూసినవారు
ఉద్యమకారులకు హామీలు అమలు చేయాలి: టీయూవి వినతి
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం డిప్యూటీ తహసీల్దార్ దౌలత్‌కు వినతిపత్రం అందజేసి, తెలంగాణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి జైలు జీవితం గడిపిన ఉద్యమకారులను గుర్తించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల మేరకు ఉద్యమకారులకు ఇండ్ల స్థలాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పెన్షన్ వంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కుకుడ్కార్ రమేష్, ఉపాధ్యక్షుడు నిష్ఠురి సత్యన్న, గౌరవ అధ్యక్షుడు శ్రీమన్నారాయణ, రాజయ్య, జగదీష్ తీవారి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్