అక్రమ ఇసుక రవాణా అడ్డుకున్న గ్రామస్థులు

0చూసినవారు
అక్రమ ఇసుక రవాణా అడ్డుకున్న గ్రామస్థులు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా కొత్తగూడలో రాత్రి వేళల్లో వాగు నుంచి ట్రాక్టర్ల ద్వారా జరుగుతున్న అక్రమ ఇసుక తరలింపును గ్రామస్థులు అడ్డుకున్నారు. సుమారు ఐదు ట్రాక్టర్లను నిలిపివేసి, తమ పంట పొలాల మీదుగా నిరంతరాయంగా జరుగుతున్న ఈ రవాణా వల్ల భూములు దెబ్బతింటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ రవాణాపై తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్