కాగజ్‌నగర్ మండలం బారెగూడ గ్రామపంచాయతీలో పనిచేయకుండా నిలిచిపోయిన చేతిపంపుల మరమ్మత్తు పనులను సర్పంచ్ కోట వేణుగోపాల్ యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా నీటి సరఫరా పనులను అత్యవసరంగా పూర్తి చేయాలని పంచాయతీ సిబ్బందికి ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వెంకటేష్, కార్యదర్శి నరేష్, సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ చర్యతో గ్రామస్తులకు ఇబ్బందులు తొలగి ఉపశమనం లభించింది.