దహెగాం: 'యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి'

68చూసినవారు
దహెగాం: 'యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి'
దహెగాం మండలం కొంచవెల్లి పాఠశాలలో శనివారం జరిగిన వాలీబాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నివారణకు యువత కృషి చేయాలని సూచించారు. జిల్లా ఎస్పీ కాంతిలాల్ ఆదేశాల మేరకు ప్రతి మండలంలో వాలీబాల్ టోర్నమెంట్‌లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. యువత చదువు, క్రీడలపై ఆసక్తి పెంచుకుని, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ విక్రమ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్