TG: మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొత్త రూల్స్ పెట్టినట్లు చర్చ జరుగుతోంది. గతంలో టెండర్ల సమయంలో చెప్పినట్టుగానే, మద్యం దుకాణాల సమయాల్లో, నడిపే విధానాల్లో కీలక మార్పులు చేసినట్లు సమాచారం. మధ్యాహ్నం 1 గంటల తరువాతే వైన్స్ షాపులు తెరుచుకోనున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటల తరువాతే పర్మిట్ రూంలోకి అనుమతించనున్నట్లు టాక్. దీనిపై క్లారిటీ రావాాల్సి ఉంది.