TG: పోరాట యోధుడు కొమురం భీం 85వ వర్ధంతి సందర్భంగా రేపు (మంగళవారం) ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు వర్తిస్తుందని కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. రేపు సెలవు నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లాలో NOV 8, ఆదిలాబాద్ జిల్లాలో DEC 12న (రెండో శనివారాలు) స్కూళ్లు పని చేస్తాయని పేర్కొన్నారు.