
ఈజిప్టులో ఘోర బస్సు ప్రమాదం.. 16 మంది మృతి (వీడియో)
ఈజిప్టులోని దక్షిణ సినాయ్ గవర్నరేట్‌లోని దహబ్-నువైబా రహదారిపై ఒక ప్రయాణికుల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 16 మంది ప్రయాణికులు మృతిచెందగా, మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో మొత్తం 43 మంది ప్రయాణిస్తుండగా, వారిలో 22 మంది జోర్డాన్ దేశస్థులు ఉన్నారు. గాయపడిన వారికి వైద్య సంరక్షణ అందిస్తున్నారు. ఇటీవల ఈజిప్టులో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని, నిర్లక్ష్యపు డ్రైవింగ్, సరైన నిర్వహణ లోపం వంటి కారణాలున్నాయని నివేదికలు తెలుపుతున్నాయి.




