తెలంగాణ మంత్రి కొండా సురేఖ, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో తన ఇబ్బందులను చర్చించినట్లు వెల్లడించారు. సమస్యకు పరిష్కారం కనుగొంటామని వారు హామీ ఇచ్చారని, వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆమె తెలిపారు. ఈ వ్యవహారాన్ని పూర్తిగా మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ లకే వదిలేస్తున్నట్లు మంత్రి సురేఖ పేర్కొన్నారు.