TG: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం అంతర్జాతీయ ప్రమాణాలకు గుర్తింపు పొందింది. ఆలయ పరిపాలన, పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలు, భక్తులకు అందిస్తున్న సేవలు, నిర్వహణ వ్యవస్థలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం ISO ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేసింది. ఈ సందర్భంగా ISO ప్రతినిధులు రామలక్ష్మి, సత్యసాయి చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్. అంజనా రెడ్డి స్వీకరించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా చేపట్టిన చర్యలకు గుర్తింపుగా ఈ ధ్రువీకరణ లభించిందని అంజనా రెడ్డి తెలిపారు.