
చండ్రుగొండ: డిమాండ్లు పరిష్కారించే వరకు విధులకు నిర్వహించం
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు విధులను నిర్వహించేది లేదని ఐకేపీ మహాలక్ష్మి మండల సమైక్య వీఓఏలు స్పష్టం చేశారు. మంగళవారం చండ్రుగొండ మండల ఐకేపీ కార్యాలయంలో ఇతర జిల్లాల సీనియర్ సీఆర్పీల ఆధ్వర్యంలో జరుగుతున్న 99 రోజుల ఐబీ శిక్షణ తరగతులను వీఓఏల సభ్యులు అడ్డుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వం తమను గుర్తించి, సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.





































