ఎస్‌ఆర్ ప్రైమ్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలి

5చూసినవారు
ఎస్‌ఆర్ ప్రైమ్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలి
భద్రాద్రి జిల్లా రామవరంలోని ఎస్‌ఆర్ ప్రైమ్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మూడ్ బాలాజీ నాయక్ శనివారం డిమాండ్ చేశారు. పాఠశాలకు సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు లేకపోయినా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారని, భారత్ పబ్లిక్ స్కూల్ పేరుతో విద్యా రికార్డులు జారీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై ఆర్‌జేడీ కార్యాలయం నుంచి షోకాజ్ నోటీసుతో పాటు రిమైండర్ కూడా జారీ అయినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఆర్ ప్రైమ్ స్కూల్ కార్యకలాపాలను నిలిపివేసి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని శనివారం కోరారు. అలాగే భారత్ పబ్లిక్ స్కూల్‌కు ఉన్న సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపుపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్