అశ్వారావుపేట మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ గృహ నిర్మాణ నమూనా భవనాన్ని హౌసింగ్ ఏఈ రాము బుధవారం పరిశీలించారు. ప్రభుత్వం అమలు చేయనున్న ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని ప్రజలకు చేరువ చేయడంతో పాటు నమూనా ప్రదర్శనకు మండలానికి ఒక భవనం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ములకలపల్లి భవనం స్లాబ్, దమ్మపేట భవనం లెంటెల్ లెవల్, మిగతా మండలాల్లోని భవనాలు పలు దశల్లో ఉన్నాయని ఆయన తెలిపారు.