
రూ. లక్షకు కొన్న చిన్నారిని రోడ్డుపై వదిలేసిన దంపతులు
మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. రెండున్నరేళ్ల చిన్నారిని లక్ష రూపాయలకు కొనుగోలు చేసిన ఓ వ్యాపారవేత్త, అతని భార్య ఆ చిన్నారి దురదృష్టాన్ని తీసుకొచ్చిందన్న అపనమ్మకంతో నడిరోడ్డుపై వదిలేశారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, చిన్నారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. విచారణలో దంపతులు చిన్నారిని అక్రమ నెట్వర్క్ ద్వారా కొనుగోలు చేసినట్లు తేలింది. పోలీసులు దంపతులను అరెస్టు చేశారు.




