అనుపురెడ్డిపల్లి మండలం పెంట్ల గ్రామంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం సమగ్రంగా పరిశీలించారు. గ్రామంలో మొత్తం 46 ఇళ్లకు అనుమతులు మంజూరు కాగా, అందులో 13 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలిన ఇళ్ల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని సంబంధిత అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ పర్యటనలో కలెక్టర్ నిర్మాణ పనుల పురోగతిని, నాణ్యతను సమీక్షించారు.