అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని వ్యాపారులపై ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకున్నట్లు మున్సిపాలిటీ చైర్మన్ జూపల్లి శశికళ తెలిపారు. సంత మార్కెట్, రోజూ వారి మార్కెట్ వసూళ్ల ధరలపై చర్చించి, గతంలో నిర్ణయించిన ధరల్లో స్వల్ప మార్పులు చేసి కొత్త ధరలను ఆమోదించారు. మున్సిపాలిటీ ఆదాయానికి సహకరించాలని వ్యాపారులను కోరారు.